గాయపడిన విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు హీరో మంచు విష్ణు మలేషియాలో తీవ్రంగా గాయపడ్డా రు. ఆయన నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మలేసియాలో జరుగుతోంది. సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ప్రమా దం జరి గింది. ప్రమాదంలో భుజం, మెడ భాగాలకు బలమైన గాయాలు తగిలాయని అంటున్నారు. పక్కటెముకలు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే యూనిట్ ఆయనను పుత్రజయ ఆస్పత్రిలో చేర్చి చికిత్స జరుపుతున్నారు. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకూ ఆయన షెడ్యూల్స్‌కు విరామం ఇస్తున్నట్టు యూనిట్ వెల్లడించింది.