భావోద్వేగాల దర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకుమార్.. సినిమాలంటే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయి. ఎన్నో లాజిక్స్, మరెన్నో మ్యాజిక్స్‌తో ఆయన సినిమాలు తీసే విధానమే ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ప్రేమలోని కొత్త కోణాన్ని, అందులో భావోద్వేగాలను గొప్పగా పండించగల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. దర్శకుడిగా ఓవైపు సినిమామలు తీస్తూనే, మరోవైపు నిర్మాతగా మారి రెండో ప్రయత్నంగా దర్శకుడు చిత్రాన్ని నిర్మించారాయన. హరిప్రసాద్ దర్శకత్వంలో అశోక్, ఈష జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 4న విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలు తెలిపారు.
* సినిమా చూశారా? ఏమైనా టెన్షనా?
- ఫైనల్ ఔట్‌పుట్ చాలా బాగుంది. బాగా వచ్చింది. చూసినప్పుడు నచ్చింది. ఎలాంటి టెన్షన్ లేదు.
* కథ ఎలాంటిది?
- ఓ మంచి లవ్‌స్టోరీ. నా తరహాలో ఉండకుండా పక్కా కమర్షియల్ వేలో వుంటుంది.
* మీ కథ అన్నారు?
- దర్శకుడిగా నేను ఎక్కువ పరిచయం ఉంది కాబట్టి అలా అని ఉంటారు తప్ప ఇది నా కథ కాదు. సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు.
* అశోక్‌ను హీరోగా ఎందుకు?
- అశోక్ చిన్నప్పటినుండి పాషన్ ఉంది. అలా తనలో వున్న ఆసక్తిని గమనించి నేను ఓకె అన్నారు. ఎం.ఎస్ చేసిన తరువాతే ఓకె అన్నా. ఆర్య-2 అసిస్టెంట్‌గా చేశాడు.
* దర్శకుడి గురించి?
- ఈ కథను హరిప్రసాదే చేశాడు. కొత్తవాళ్ళతో సినిమా తీయాలనుకున్నాడు. అశోక్ ఉన్నాడు కదా, అతనితో చేస్తే ఎలా ఉంటుందని చెప్పినపుడు, బాగుంటుందన్నాడు.
* అశోక్ ఎలా చేశాడు?
- కొన్ని భావోద్వేగాలను బాగా పండించాడు. అనుభవం వున్న నటుడిగా కన్పించాడు.
* సినిమా మీ కథలా అన్పించిందా?
- అలాంటిదేం లేదు
* అశోక్‌కు ఎలాంటి ఇమేజ్ వస్తుంది?
- మరో మూడు నాలుగు సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. పరిస్థితి మరోలా మారిందనుకోండి, చేతిలో వున్న పని చేసుకుంటూ వెళతాడు. అతనిలో మంచి రైటింగ్ స్కిల్ కూడా వుంది.
* ప్రొడక్షన్‌లో కేర్?
- ఆ విషయాన్ని నేను పట్టించుకోను. దానికెంతైంది? ఇదెంతా? అలాంటివి చూసుకుంటూ వెళితే మన ఇంపాక్ట్ పోతుంది. మా అన్న థామస్‌రెడ్డి చూసుకున్నారు. సైట్‌కి నేను తక్కువగా వెళ్లాను.
* దర్శకుడికి ఏవైనా సలహాలు ఇచ్చారా?
- సినిమా విషయంలో మొత్తం అతనే చూసుకున్నాడు. కథ, అన్నీ అతనే. నేను ఒక్కరోజు సెట్స్‌కు వెళ్లి ఒక్క విషయాన్ని చెప్పినా సుకుమారే చేశాడని అంటారు. అందుకే నేనేమి చెప్పలేదు.
* మీ స్టైల్లో లాజిక్స్ ఉంటాయా?
- ఇది ఓ దర్శకుడి ప్రేమ ఓ వైపు మరోవైపు తన వృత్తిలో ఎదగాలని స్వార్థం కలిసి వుంటుంది. స్వార్థం అంటే జీవితంపట్ల ఎక్కువగా కేర్ తీసుకునే కుర్రాడి ప్రేమ. లాజిక్స్ ఏమీ లేవు. దర్శకుడి క్రియేటివిటీ 20 శాతం వుంటే మేనేజ్‌మెంట్ 80 శాతం వుంటుంది.
* మీ బ్యానర్‌లో పెద్ద సినిమా చేస్తారా?
- చేయాలని వుంది. దానికి హీరోనే ఒప్పించాలి. ఇవన్నీ కుదిరితే తప్పకుండా చేస్తా.
* దేవిశ్రీని తీసుకోలేదు?
- ఈ సినిమాకు దేవిని అడగలేదు. ఎందుకంటే, అందరూ కొత్త. అతన్ని స్వార్థంతో వాడుకోవడానికి మనసు ఒప్పలేదు.
* రంగస్థలం ఎంతవరకు వచ్చింది?
- 50 శాతం షూటింగ్ పూర్తయింది. మరో షెడ్యూల్ త్వరలో పూర్తవుతుంది. కథాపరంగా పల్లెటూరు నేపథ్యంలో పాతిక సంవత్సరాల క్రితం జరుగుతుంది కనుక, ట్యాగ్‌లైన్ 1985 అని పెట్టాం. పల్లెటూరు నేపథ్యంలో ఎప్పటినుంచో చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. సంక్రాంతికి విడుదల చేస్తాం.
* మల్టీస్టారర్, సైన్స్ ఫిక్షన్ కథలతో?
- మల్టీస్టారర్ ఏమో కానీ, సైన్స్ ఫిక్షన్ చేయాలని వుంది. కానీ అది తెలుగులో కుదరదు. హిందీలో ప్లాన్ చేయాలి.
* డ్రగ్స్ విషయంపై మీ స్పందన?
- ఈ సంఘటనతో ఓ మంచి కథ దొరికిందనిపించింది. ఎందుకంటే, పూరి చాలా మంచి వ్యక్తి. ఫిలాసిఫికల్‌గా మాట్లాడతాడు.
* నెక్స్ట్ సినిమాలు?
- ప్రస్తుతం కథలు ఉన్నాయి. నా బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌తో ఓ సినిమా చేస్తున్నాం.

- శ్రీ