మెగాస్టార్‌తో అమితాబ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీ నెం 150 విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 3ఉయ్యాలవాడ నరసింహారెడ్డి2 చిత్రంపై అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రామ్‌చరణ్. అంతేగాక బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు బాలీవుడ్‌లో ఆదరణ పెరిగిన నేపథ్యంలో అక్కడ సినిమాకు మార్కెట్ కల్పించేందుకు గొప్ప ప్లాన్ వేశారు. అదేమిటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌ను ఇందులో నటింపజేయ డం. ఈమేరకు ఇప్పటికే అమితాబ్‌తో చర్చ లు ముగిశాయని, ఆయనకూడా సుముఖంగానే ఉన్నారని వార్తలొస్తున్నాయి. గతంలో కూడా ఒక కార్యక్రమంలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని అమితాబ్ తన మనసులోని మాటను వెలిబుచ్చారు కూడా. మరి ఆ మాట ప్రకారమే ఆయన ఈ సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి కన్‌ఫర్‌మేషన్ వచ్చే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఆయనే గనుక నటిస్తే చిరు, చరణ్‌లు అనుకున్నట్లు ఈ సిని మా జాతీయ స్థాయి ప్రాజెక్టుగా తయారవడం ఖాయం. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు.