నయా షాక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య స్టార్స్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లోనూ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే సినిమా కోసం.. రెండు మూడు నెలలు కష్టపడాలి.. కానీ కమర్షియల్ యాడ్స్ అయితే రెండు మూడు రోజుల్లో నటిస్తే సరిపోతుంది. పైగా దానికి రెమ్యూనరేషన్ కూడా బాగా ఎక్కువ. లేటెస్టుగా ఈ విషయంలో సంచలనం రేపింది గ్లామర్ భామ నయనతార. కేవలం రెండు రోజుల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా 5 కోట్లు తీసుకుందట. నయనతార లేటెస్టుగా టాటా స్కై కమర్షియల్ యాడ్‌కోసం ఈ రెమ్యూనరేషన్‌ని వసూలు చేసింది. నిజానికి ఈ అమ్మడు ఒక సినిమా కోసం రెండు నుండి మూడు కోట్ల వరకు వసూలు చేసేది. కానీ ఇలా కమర్షియల్ యాడ్ కోసం ఓ రేంజ్‌లో రెమ్యూనరేషన్ వసూలు చేయడం సంచలనం రేపింది. మరోవైపు నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది.