నానితో ప్రేమమ్ భామ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూట్ కథలతో కొత్తదనాన్ని రుచి చూపించటంలో నాని బాగా ముదిరిపోయాడు. పట్టిందల్లా హిట్టవుతున్న టైమ్ -నానికి నీడలా నడుస్తోంది. అందుకే -వర్థమాన స్టార్ హీరోల రేసులో నాని కనుచూపుమేర ముందున్నాడు. వరుస విజయాలు అతన్ని వెంటాడుతున్నాయి. తాజాగా నిన్నుకోరి చిత్రంతో వైవిధ్యమైన కథలో భిన్నమైన పాత్ర పోషించి మెప్పించిన నాని -తరువాతి ప్రాజెక్టుగా ఎంసిఏ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. ఈ ప్రాజెక్టు నడుస్తుండగానే ‘కృష్ణార్జున’ ప్రాజెక్టుకూ కమిటయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా ప్రేమమ్ భామ పేరు వినిపిస్తోంది. ప్రేమమ్‌తో ఫ్రెష్ ఫీల్ అందించి, అఆ పాత్రతో అందరి మనసులు కొల్లగొట్టిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఓకె అయిందన్నది ఇండస్ట్రీ టాక్. మొన్నటికి మొన్నవచ్చిన శతమానంభవతి చిత్రం హిట్టుతో ఎగిరి గంతులేస్తున్న అనుపమకు, నానితో ప్రాజెక్టు దొరికే అవకాశం రావడంతో -వీళ్లిద్దరి కెమిస్ట్రీమీద ఇండస్ట్రీలోనూ ఆసక్తి కనిపిస్తోంది. కృష్ణార్జునలో నాని రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. లవ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని, నాని, అనుపమల మధ్య సాగే ప్రేమకథ చక్కని ఫీల్ ఇస్తుందని కథనాలు మొదలయ్యాయి. అనుపమ పాత్ర కొత్తగా ఉండబోతోందన్న టాక్ మొదలైంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఆమె ఎవరనేది ఎంపిక చేసే వరకూ సస్పెనే్స.