డబుల్ ధమాకా నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ అభిమాను లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిం ది. మహేష్ పుట్టిన రోజు నేడు. దాంతోపాటు ఆయన నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ కూడా నేడు విడుదల చేస్తున్నారు. ఉదయం9 గంటలకు ముహూర్తం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అటు ట్రేడ్ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. ఈ సినమా టీజర్‌ను నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారట. దాంతోపాటు మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘్భరత్ అను నేను’ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా నేడు విడుదల కానుంది. మొత్తానికి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఏకంగా రెండు భారీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. మహేష్ నటిస్తున్న స్పైడర్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. దాంతోపాటు భారీ బడ్జెట్‌తో భారీ టెక్నికల్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమాపై మహేష్‌బాబు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నా య. ఓవైపు టీజర్,మరోవైపు ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలను డబుల్ దమాకాగా వారు భావిస్తున్నారు.