శరవేగంగా సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం జోరుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుగుతోంది. ఏడు రోజులపాటు అక్కడ చిత్రీకరణ జరుపుతున్నారట. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంబంధించి మరో 180 రోజుల చిత్రీకరణ మిగిలి వుందని, దాంతో షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ సభ్యుడు తెలియజేశాడు. గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత వుండే ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో సంచలన చిత్రంగా నిలవడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.