కింగ్‌ఖాన్‌తో ముగ్గురు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం సినిమాలంటేనే పిచ్చి. అందులో షారుక్ సినిమా అంటే అతని ఫ్యాన్స్‌కి -వేలం వెర్రి. ఆ ఇమేజ్ కొంతకాలంగా మసకబారుతోంది. షారుక్ నుంచి వస్తున్న చిత్రాలన్నీ క్రమంతప్పకుండా ఆడియన్స్‌నే కాదు, ఫ్యాన్స్‌నీ నిరుత్సాహపరుస్తున్నాయి. ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో 3చెన్నై ఎక్స్‌ప్రెస్2వినా, షారుక్ సినిమా అని గొప్పగా చెప్పుకునే చిత్రాలు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య వైవిధ్యమైన ఫ్యాన్2చేసి నిరుత్సాహపర్చాడు. యే ది ల్ హై ముష్కిల్2లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీతోను ప్చ్ అనిపించేశాడు. డియర్ జిందగీ, రరుూస్2లాంటి చిత్రాలు ఖాన్ ఇమేజ్‌ను ఏమాత్రం పెంచలేకపోయాయి. తాజాగా వచ్చిన జబ్ మేరే మెట్ సజల్2ఒక్కటే -్ఫరవాలేదు అనిపించుకుందే తప్ప 3ఆహా2అనిపించలేకపోయింది. ఈ పరిణామాలతో షారుక్ జాగ్రత్తపడినట్టే కనిపిస్తోంది. షారుక్ రాబోయే చిత్రం శిధ్యాత్2, మళ్లీ తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఈ ప్రాజెక్టుపై షారుక్ కాస్త ఎక్కువగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో దుమ్ము దులిపేసిన కాంబో పెయిర్ 3దీపికా పదుకొనెతో మళ్లీ జతకట్టాడు. షారుక్, దీపికా అనగానే మళ్లీ చెన్నై.. లాంటి సీన్స్ తో అలరిస్తాడన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజా గా మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది -షారుక్ ప్రాజెక్టులో ముగ్గురు స్టార్లు కనిపిస్తారని. బిగ్ బి అమితాబ్‌బచ్చన్, తమి ళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాహుబలి వీరుడు ప్రభాస్ కూడా శిధ్యాత్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం బయటకు పొక్కింది. దాంతో చిత్రానికి మల్టీ స్టారర్ క్రేజ్ వచ్చేసింది. ఖాన్‌కు బిగ్ బి ఒక ప్రేరణ. ఇక తలైవా అంటే షారుక్‌కు పిచ్చి. తాజా గా అం తర్జాతీయ నటుడిగా బాహుబలితో ఖ్యాతి అందుకున్నవాడు ప్రభాస్. ఈ ముగ్గురు స్టార్లు ప్రాజెక్టులో కనిపించబోతున్నారంటే -శిధ్యాత్‌పై ఎలాంటి అంచనాలు వచ్చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న శిథ్యాత్‌లో ముగ్గు రు స్టార్లకు ప్రత్యేక పాత్రలంటూ లేకపోయినా, ఎలా కనిపించబోతున్నారన్న ఆసక్తి రేకెత్తుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ప్రాజెక్టులో -వైవిధ్యమైన అంశాలను జోడించి ప్రత్యేకత చాటుకోవాలన్న తలంపుతో షారుక్ ఉన్నాడని అంటున్నారు. డిసెంబర్‌లో షూట్‌కు వెళ్లనున్న షారుక్ -శిధ్యాత్ ప్రాజెక్టుతో ఎలా మురిపిస్తాడోనని అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును రక్తికట్టిస్తే -బాలీవుడ్‌లో కొద్దిరోజులు ఈ తరహా సినిమాలు రావొచ్చు. ఒక హీరో ప్రాజెక్టులో ముగ్గురు నలుగురు హీరోలు స్పెషల్ అప్పియరెన్స్ స్టయిల్ మళ్లీ రావొచ్చు.

- శేఖర్