సూపర్‌స్టార్‌తో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలారోజుల తరువాత సూపర్‌స్టార్ కృష్ణ తెరపై కనిపించనున్నారు. రవితేజ 3బలాదూర్2, విక్రమ్ మల్లన్న సినిమాల్లో కనిపించిన కృష్ణ, ఆ తరువాత గత ఏడాది శ్రీశ్రీ చిత్రంలో నటించారు. ఇప్పుడు తాజాగా మహేష్ హీరోగా చేస్తున్న 3్భరత్ అను నేను2 చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. కృష్ణ 3కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 1172 తదితర చిత్రాల్లో తన కుమారుడు మహేష్‌బాబుతో కలిసి నటించారు. తరువాత మహేష్ హీరోగా నటించిన 3రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ2 చిత్రాల్లోనూ అతిథి పాత్రల్లో కనిపించారు.
దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్లీ తండ్రీ కొడుకులుగా తెరపై కనువిందు చేయనున్నట్టు చిత్రవర్గాల సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయిక. ఇందులో కృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. అదే నిజమైతే మళ్లీ తండ్రీ కొడుకులను తెరపై చూసే అవకాశం ఉంటుందని అభిమానలు అప్పుడే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సినిమాలో చాలామంది సీనియర్ నటులు కనిపిస్తారని కూడా సమాచారం. ఇందులో మహేష్‌బాబు మఖ్యమంత్రి పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.