గుడ్.. బ్యాడ్.. అగ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా, మాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో మురళి, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ నటుడుగా, మాటల రచయితగా ఆందరికీ సుపరిచితుడినే. గుండెజారి గల్లంతైందే, మనం సినిమాలకు నా సంభాషణలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తరువాత ఈ సినిమాతో దర్శకుడుగా నా జర్నీ మొదలుపెట్టాను. సాధారణంగా పెళ్లిని ఘనంగా చేయడం చూస్తుంటాం, కానీ షష్టిపూర్తి కార్యక్రమాలు జరగడమే లేదు. కానీ పెళ్లి సైలంట్‌గా జరగాలి, షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత అంజిరెడ్డి ఇచ్చిన సహకారంతో సినిమాను చక్కగా తెరకెక్కించాం. మంచి, చెడు, తింగరితనం అనేది సందర్భాన్ని బట్టి మననుండి బయటపడతాయి. అందుకే ఈ టైటిల్‌ను ఎంపిక చేసాం. కిశోర్ అద్భుతంగా నటించాడు. 1988-89లో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం అన్నారు. శ్రీముఖి మాట్లాడుతూ జంటిల్‌మెన్ తర్వాత స్పెషల్ సాంగ్స్, స్పెషల్ అప్పియరెన్స్ అవకాశాలు చాలా వచ్చాయి. కానీ అవి చెయ్యడానికి నాకిష్టం లేదు. మంచి కథ వస్తేనే చేద్దామనుకున్న సమయంలో హర్షవర్ధన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను అన్నారు. కార్యక్రమంలో మురళి, సంతోష్, సురేష్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు. చిత్రానికి కెమెరా సురేష్, రచన, సంగీతం, దర్శకత్వం హర్షవర్ధన్.