కోలీవుడ్‌కి హాథీరామ్ బాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాథీరామ్ బాబా కోలీవుడ్‌కు వెళ్తున్నాడు. అక్కినేని నాగార్జునను పరమ భక్తుడిగా చూపిస్తూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేసిన కమర్షియల్ చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని ఇప్పడు తమిళంలోకి అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ్- రాఘవేంద్రల కాంబినేషన్‌లో ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చా యి. తరువాత రాఘవేంద్రరావు కమర్షియాలిటీని వదిలిపెట్టకుండానే -ట్రెండ్ మార్చి నాగ్‌తో భక్తి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి సినిమాలు అలా వచ్చినవే. ఆ మధ్య ఓం నమో వెంకటేశాయ సినిమానూ తెరకెక్కించారు. వెంకటేశ్వరుడి పరమ భక్తుడైన హథీరాం బాబా కథను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి అనువదించి విడుదల చేస్తున్నారు. బ్రహ్మాండ నాయకన్ పేరిట చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే తమిళ డబ్బింగ్ పనులు పూర్తికావచ్చాయట. తమిళంలో నాగార్జున, అనుష్కలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.