రెండో షెడ్యూల్‌లో అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట గా వక్కంతం వంశి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండి యా అనే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఈనెల 18 నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు జరపనున్నారు. ఈ షెడ్యూల్‌లో అర్జున్, విలన్‌గా నటిస్తున్న శరత్‌కుమార్ పాల్గొంటారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ- బన్నీ ఎనర్జీకి తగిన విధం గా ఈ కథలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయని, మంచి కథలు అందించిన వంశి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. యాక్ష న్ కింగ్ అర్జున్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:రాజీవ్ రవి, సంగీతం:విశాల్ శేఖర్, నిర్మాత:శిరీషా శ్రీ్ధర్ లగడపాటి, రచన, దర్శకత్వం:వక్కంతం వంశి.