ఆనందోబ్రహ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహి వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్ల, శశిదేవిరెడ్డి రూపొందించిన చిత్రం ఆనందోబ్రహ్మ. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నటుడు ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీని విడుదల చేశారు. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి థియేటర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ- తొలిసారిగా ఇండియన్ సినిమాలో ఓ దెయ్యం మనుషులకు భయపడడం అనే కథతో ఈ సినిమా కొత్తగా వస్తోందని, తాప్సీ అందమైన దెయ్యంగా నటించడం సరికొత్తగా ఉంటుందని, ఈనెల 18న సినిమా విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ సినిమా నిర్మించేటప్పుడు కథను దర్శకుడు తనకు చెప్పాడని, ఇపుడు టీజర్ చాలా బాగుందని, సినిమాలోని అన్ని పాత్రలు ఇప్పుడు చూశానని, అందరికీ నచ్చుతుందని నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో నలుగురు హీరోలతో తాను కలిసి పనిచేశానని, ఈనెల 18 నుండి థియేటర్‌లో సందడి మొదలవుతుందని నటి తాప్సీ తెలిపారు. కార్యక్రమంలో సుధీర్‌బాబు, మహి వి.రాఘవ్, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, వెనె్నల కిశోర్ పాల్గొని విశేషాలు తెలిపారు.