హీరోగా.. ఫైటర్ కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విఎస్ క్రియేటివ్ వర్క్స్ పతాకాంపై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యవిజయ్ ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో గురువారం ఉదయం సినిమా ప్రారంభమైంది. తొలి సన్నివేశంపై దర్శకుడు వివి వినాయక్ క్లాప్‌నివ్వగా, ఫైట్‌మాస్టర్ విజయన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ పరిశ్రమ రుణం తీర్చుకోవడానికి హీరోగా రాహుల్ విజయ్‌ని, నిర్మాతగా దివ్య విజయ్‌ను పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చామన్నారు. రాహుల్‌కు సరిపోయే కథతో సినిమా రూపొందిస్తున్నామని, స్క్రిప్ట్ వైవిధ్యంగా వచ్చిందన్నారు. ఈనెల 21నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు రాము కొప్పుల చెప్పారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మూడు నెలల్లో జరిపే షెడ్యూల్స్‌తో సినిమా పూర్తవుతుందని అన్నారు. సీనియర్ టాప్ టెక్నీషియన్లంతా సినిమాకు పని చేస్తున్నారని నిర్మాత దివ్య విజయ్ తెలిపారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే చిత్రంలో ప్రేమకథ ఎలిమెంట్‌గా, మిగతా ఎలిమెంట్స్‌ని లింక్ చేస్తూ చిత్రం వైవిధ్యంగా దర్శకుడు రూపొందిస్తున్నారని హీరో రాహుల్ విజయ్ చెప్పారు.