మహానుభావుడి ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మహానుభావుడు. యువి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ హీరోయిన్‌గా వంశి, ప్రమోద్ రూపొందిస్తున్న చిత్రానికి మహానుభావుడు టైటిల్ ఖరారు చేశారు. పాట వినా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటలీ, ఆస్ట్రియా, క్రొయేషియా లాంటి దేశాల్లో, పొల్లాచ్చి, హైదరాబాద్‌లలోని పలు అందమైన లొకేషన్‌లలో షూటింగ్ జరిపారు. ఈనెల 24న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రంలో మహానుభావుడి పాత్ర నుంచి వచ్చిన కామెడీనచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఒక్క పాట మినహా సినిమా అంతా పూర్తయిందని తెలిపారు. శర్వానంద్‌కు తమ సంస్థలో మరో మంచి చిత్రంగా సినిమా నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.