మేమూ మనుషులమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా మొత్తానికి బాలీవుడ్‌లోనే సెటిలైంది. సౌత్‌లో అవకాశాలు వస్తున్నా, ఇక్కడి సినిమాలపై ఆమె ఆసక్తి చూపించడం లేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. తాజాగా ఇలియానా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది? అదీ తన ఫ్యాన్స్‌పై.. కాదు పబ్లిక్‌పైన కూడా! ఇంతకీ ఏ విషయం గురించి అలా రెస్పాండ్ అయ్యిందంటే.. -ఇలియానా, అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటించిన ‘బాద్షాహో’ ప్రమోషన్‌ల్ ఈవెంట్‌కు హాజరైందట. అక్కడ ఇల్లీ బేబీని చూడ్డానికి జనాలు, అభిమానలు ఎగబడ్డారు. ఒక ఆకతాయి మాత్రం తప్పుగా ప్రవర్తించాడు. దాంతో కోపగించిన ఇలియానా, అక్కడినుండి వెళ్లిపోయింది. ఆదే కోపంలో ఓ ట్వీట్ చేస్తూ ‘నేను పబ్లిక్ ఫిగర్నే. అంతమాత్రాన మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాన్ని అభిమానం అని ఎలా అనుకుంటాం? మేమూ మనుషులమే, పైగా నేను ఆడపిల్లను. అలా ప్రవర్తిస్తే ఎలా?’ అంటూ దుమ్మెత్తిపోసింది. అక్కడితో ఆగకుండా ‘మనం ఎలాంటి మూర్ఖులమధ్య బ్రతుకుతున్నామో నాకు ఇప్పుడే అర్థమైంది. సినిమా తారలకు బయట ఏకాంతం దొరకడం అసాధ్యమే! ఎవరికి నచ్చినట్టు వాళ్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు’ అంటూ సోషల్ మీడియాలో చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది.