హలో.. అఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రానికి ‘హలో’ అన్న పేరును ఖరారు చేశారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నాగార్జున రూపొందిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ చిత్ర యూనిట్‌ను విష్ చేసిన వీడియోను కూడా విడుదల చేశారు. హలో అనే పలకరింపును కాజల్, ప్రభాస్, శృతిహాసన్, రామ్‌చరణ్, నాగచైతన్య, వరుణ్‌తేజ్, సమంత, సూర్య, నాని, వెంకటేష్, రాజవౌళి, రకుల్‌ప్రీత్‌సింగ్, రానాలు హలో అంటూ మాట్లాడారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి డిసెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:పి.ఎస్.వినోద్, రచన, దర్శకత్వం:విక్రం కె.కుమార్.