గ్లామర్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల తాప్సికి ఈమధ్య బాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కింది. వరుసగా బేబి, పింక్, నామ్ షబానా లాంటి సినిమాలతో నటిగా ఇమేజ్ తెచ్చుకున్న తాప్సీ.. అబ్బో ఇలాంటి అవకాశాలే వరుసగా వస్తాయా అని అనుకుందో ఏమో.. అందుకే ట్రెండ్ మార్చి హాట్ హాట్ అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న జుడువా-2లో తాప్సి అందాలు బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో తాప్సి బికినీ అందాలు షాక్ ఇచ్చాయి. దానికితోడు ఈ భామ గాటు లిప్‌లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అప్పట్లో తెలుగులో వచ్చిన హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్‌గా జుడువా సల్మాన్‌ఖాన్‌తో తీవారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా జుడువా-2 రూపొందుతోంది. వరుణ్ ధావన్ హీరోగా రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో తాప్సితోపాటు హాట్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. ఈ ఇద్దరి భామల గ్లామర్ అందాలు చూసి ప్రేక్షకులకు షాక్ ఇస్తాయట! ఇక బాలీవుడ్‌లో సీరియస్ సినిమాలతో ఇమేజ్ తెచ్చుకున్న తాప్సి.. గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కవుట్ అయ్యేలా వుంది మరి!