థ్రిల్లర్ అంశాలతో వీడెవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్, ఈషాగుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రైనా జోషి నిర్మించిన చిత్రం ‘వీడెవడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 8న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ- ఎస్‌ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర సినిమా అన్నీ రీమేక్ చిత్రాల్నే తీశాను. కానీ నేను తెలుగులో చేస్తున్న మొదటి స్ట్రెయిట్ సినిమా ఇది. మంచి టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాగా వచ్చింది. ముఖ్యంగా సచిన్ జోషి నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- డిఫరెంట్ కానె్సప్ట్‌తో వస్తున్న సినిమా ఇది. టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్ చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. హీరో సచిన్ మాట్లాడుతూ- మంచి థ్రిల్లర్ మూవీ ఇది. నా పాత్ర పాజిటివ్, నెగెటివ్ యాంగిల్స్‌లో వుంటాయి. అద్భుతమైన కథనంతో సాగే ఈ సినిమాలో అన్ని రకాల అం శాలు ఉన్నాయి. తప్పకుండా నాకు మంచి బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుంది అన్నా రు. ఈ చిత్రానికి ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, నిర్మాత:రైనా జోషి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:తాతినేని సత్య.