తొంగి తొంగి చూడమాకు చందమామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబి అక్షర ప్రధాన తారాగణంగా హరివల్లభ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.ఎం. రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 3తొంగి తొంగి చూడమాకు చందమామ. ఈ చిత్రానికి సంబంధించిన షూ టింగ్ శరవేగంగా సాగుతోంది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ- ఓ కాలనీలో జరిగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేమకథల్లో ఓ వినూత్న ప్రయత్నమని తెలిపారు. తమ మధ్య వున్నది ఎలాంటి బంధమో తెలియని ఓ జంట చివరివరకూ ఒకరికి ఒకరు తమ మనసులో వున్న మాట తెలుపకపోతే చివరికి ఏం తెలుసుకున్నారు అనే కథనంతో రూపొందిస్తున్నామని అన్నారు. క్లైమాక్స్‌లో ప్రేమను చెప్పుకోవడంతోనే సినిమా ముగుస్తుందని, అదే ఈ చిత్రంలో హైలెట్ అని తెలిపారు. బొబ్బిలిలో తొలి షెడ్యూల్ పూర్తిచేశామని, సెప్టెంబర్ మొదటివారం నుండి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని ఆయన అన్నా రు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. బస్టాప్ సాయి, జబర్దస్త్ మహేష్, అప్పారావు, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ విన్నకోట, సంగీతం:హరి గౌర, మాటలు:తిరుమల నాగ్, పాటలు:బాలాజీ, నిర్మాత:ఎ.ఎం.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆనంద్ కానుమోలు.