పవన్ ఫస్ట్‌లుక్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటమరాయుడు సినిమా తరువాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో ఇది 25వ చిత్రం అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా ఇంకా ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని తెలియజేయలేదు పవన్. దీంతో సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెలువడుతున్నాయి. అయితే వాటన్నిటికి సెప్టెంబర్ రెండున చెక్ పెట్టనున్నారట పవన్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పవన్ పుట్టినరోజు విడుదల కానుందని ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ. మరి పవన్ పుట్టిన రోజు ఎలా దర్శనం ఇస్తాడో.. ఏ టైటిల్ పెడతారో చూడాలి.