దర్శకుల ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ భామ మరో వైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన ఈ భామ తాజాగా మరో సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఈ సినిమా పనుల్లో భాగంగా అమెరికాలో వున్న ప్రియాంక తాజాగా సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న గుస్టాక్2 చిత్రం కోసం ఇండియా వచ్చింది. ప్రియాంక ఇండియా వచ్చిం దని తెలియగానే ఆమె కోసం ఓ పాతికమంది ఎదురుచూస్తున్నారు. ఎం దుకో తెలుసా? ప్రియాంకతో సినిమా చేయాలని ఆ పాతికమంది క్యూ లో ఉన్నారు. వారు ఎవరోకాదు బాలీవుడ్ దర్శకులు? వీరిలో పింక్ ఫేమ్ అనిరుద్ రాయి చౌదరి, చెక్ దె ఇండియా ఫేమ్ షిమిత్ అమిన్, విశాల్ భరద్వాజ్ లాంటి దర్శలకులు కూడా ఉన్నారు. ఆమె రాగానే వరుసగా కథలు వినాల్సి ఉంటుంది. అయితే ఓ మూడు సినిమాలకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్టు ప్రియాంక సన్నిహితులు చెబుతున్నారు. హాలీవుడ్‌లో క్వాంటికో, ఈజిట్ రొమాంటిక్, ఏ కిడ్ లైక్ జేక్ లాంటి సినిమాల్లో ఈ భామ నటించింది.