విజయదశమికి మహానుభావుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 3మహానుభావుడు2. యు.వి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ కథానాయికగా వంశి, ప్రమోద్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయనున్నారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇటలీ, ఆస్ట్రియా, క్రొయేషియా లాంటి దేశాలలో, పొల్లాచ్చి, హైదరాబాద్‌లలోని పలు అందమైన లొకేషన్‌లలో షూటింగ్ జరిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహానుభావుడి పాత్ర నుండి వచ్చిన కామెడీ నచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఒక్క పాట మినహా సినిమా అంతా పూర్తయిందని తెలిపారు. శర్వానంద్‌కు తమ సంస్థలో మరో మంచి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. శర్వానంద్ డిఫరెంట్ పాత్రలో కన్పించే ఈ చిత్రాన్ని మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడకుండా రూపొందించామని చెప్పారు. తమ సంస్థలో ఆయన చేస్తున్న మూడో చిత్రం ఇదని, ఈ రోజు విడుదల చేసిన తమ టీజర్ చూస్తే కామెడీ ఏ రేంజ్‌లో వుందో అర్థమవుతోందని తెలిపారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వారు తెలిపారు. భలే భలే మగాడివోయ్ చిత్రం తరువాత తనకు నచ్చిన పాత్రతో మహానుభావుడు చిత్రాన్ని రూపొందించానని, శర్వానంద్ ఫుల్ కామెడీ నేపథ్యంలో నటించాడని, మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించామని దర్శకుడు మారుతి తెలిపారు. ఈరోజున విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందని, మళ్లీ తన స్టైల్లో వుందని అందరూ చెప్పడం ఆనందాన్నిస్తోందని, శర్వానంద్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన అన్నారు. తమన్ అందించిన ఆడియో అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. వెనె్నల కిశోర్, నాజర్, భద్రం, కల్యాణి, నటరాజ్, పిజ్జాబాయ్, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకీ, శంకర్‌రావు, రమాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బుల చౌదరి, సుభాష్, ఆర్‌కె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:నిజార్ షఫి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు:వంశీ, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మారుతి.