రజనీ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం 3స్పైడర్2 సినిమాతో బిజీగా ఉన్న క్రేజీ దర్శకుడు మురుగదాస్ అంటే సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోస్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మురుగదాస్ మాత్రం ఆ హీరోతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో ఆసక్తిగా ఉం దని చెప్పాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. సూపర్‌స్టార్ రజనీకాంత్? రజనీతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో ఆసక్తిగా ఉందని, ఇప్పటికే ఆయనకోసం ఓ కథను కూడా సిద్ధం చేసానని అంటున్నాడు. ఆయన ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా చేయడానికి సిద్ధమే అని అంటున్నాడు మురుగదాస్. ప్రస్తుతం కాలా సినిమాలో నటిస్తున్నాడు రజనీకాంత్. మరోవైపు రోబో 2.0 విడుదలకు సిద్ధం అవుతోంది. మరి రజని ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి! అలాగే అమీర్, అక్షయ్, సల్మాన్‌లతో కూడా సినిమాలు చేయడానికి కథలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అందరి స్టార్ హీరోలను రౌండప్ చేస్తున్నాడు ఈ క్రేజీ దర్శకుడు.