పైసా వసూల్ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ- ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను రూపొందించామని, సినిమాకు సంబంధించిన టీజర్, స్టంపర్ విడుదలయ్యాక సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 1న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సెన్సార్ వారు యు/ఎ సర్ట్ఫికెట్ అందించారని, బాలకృష్ణ అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా వున్నాయని ఆయన అన్నారు. డూప్ లేకుండా బాలకృష్ణ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని, అలాగే అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.
బాలకృష్ణతో తమ సంస్థలో రూపొందించిన ఈ తొలి చిత్రం ఘనివిజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. శ్రీయ, ముస్కాన్, ఖైరాదత్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కబీర్‌బేడి, అలీ, పృధ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌జిత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.