ఇదొక వలపుల సౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికిరణ్, ప్రాచీ అధికారి జంటగా తుల్జ భవానీ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం వలపు సౌధం. బల్వాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రానికి కృష్ణ మోహన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సునీల్ సాగర్, మజ్జు సోహ్రాబ్ సంయుక్తంగా రొపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేసి దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సునీల్ సాగర్ మాట్లాడుతూ లవ్, హారర్, ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో నూతన సంగీత దర్శకుడు మజ్ను అందించిన ఏడుపాటలు శ్రోతలను అలరిస్తాయని, ఆర్‌ఆర్ హైలెట్‌గా వుంటుందని తెలిపారు. మాజీ మిస్టర్ ఆంధ్ర బల్వాన్ ఓ కీలకమైన పాత్రలో పోలీస్ పరిశోధన అధికారిగా నటిస్తున్నారని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమా వైవిధ్యంగా రూపొందుతోందని, ప్రేమికులకు అందమైన దృశ్య కావ్యంగా వుంటుందని ఆయన అన్నారు. సత్యప్రకాష్, జీవా, కవిత, కోటా శంకర్‌రావు, సంపత్‌రాజ్, తిరుపతి ప్రకాష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానకి కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: సాయి శ్రీనివాస్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం: ఎస్‌కె మజ్ను. నిర్మాతలు: సునీల్ సాగర్, మజ్ను సోహ్రాబ్, దర్శకత్వం: కృష్ణమోహన్.