ఔనా.. నిజమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ హాట్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అమ్మడు స్పందిస్తూ నాకు ప్రెగ్నెన్సీ లేదు మొర్రోయ్...అని మొత్తుకున్నా కూడా ఎవరూ వినడంలేదు. పైగా ఈ అమ్మడికి పెళ్లికూడా కాలేదు మరి! ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే.. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన నర్గిస్ ఫక్రి బాలీవుడ్‌లో ఎంట్రీఇచ్చింది. గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ ప్రారంభంలో వరస అవకాశాలతో దూసుకుపోయింది. అయితే ఈమధ్య చేసిన సినిమాలన్నీ పరాజయం పాలు అవుతుండడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో ఐటెం గర్ల్‌గాకూడా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే జోరుగా ప్రేమాయణం కూడా మొదలుపెట్టిన నర్గీస్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఈ మధ్య ఎయిర్‌పోర్టులో కనిపించిన ఈమె ఓ డ్రెస్‌లో ప్రెగ్నెంట్‌గా వున్నట్టు కనపడడమే కారణం అని అంటున్నారు. దాంతో ఈ విషయం వైరల్ అయింది. నర్గిస్ స్పందిస్తూ..నేను ప్రెగ్నెంట్‌ని కాను..ఎక్కువ పుడ్ తిన్నందుకు అలా కనిపించిందేమో అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. మరి ఇందులో నిజానిజాలు ఎలా వున్నాయో తెలియాలంటే కాలమే బదులు చెప్పాలి.