నేనే సౌత్ క్వీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్న క్వీన్ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఇప్పటికే తమన్నా, అమలాపాల్ పేర్లు వినిపించాయి. ఆమధ్య తమన్నా ఒకే అయిందంటూ వార్తలు వచ్చాయి కూడా. కానీ తాజాగా ఈ చిత్రంలో కాజల్ ఫైనల్ అయినట్టు యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ భారీ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. తాజాగా నేనే రాజు నేనే మంత్రి, వివేకం సినిమాలతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న అందాలభామ కాజల్ మొత్తానికి సౌత్ క్వీన్‌గా మారనుంది.