పాటకు వచ్చిన.. యుద్ధం శరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో వారాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన యుద్ధం శరణం చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు సీడీలను ఆవిష్కరించి దర్శకుడు రాజవౌళికి అందజేశారు. అనంతరం రాజవౌళి మాట్లాడుతూ- బాహుబలికి ఎంత ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయో ఈ సినిమాకు కూడా కృష్ణ అంతే పనిచేశాడు. సినిమా మీద మంచి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా చైతన్య కధలు ఎంచుకునే తీరు అద్భుతం. విలన్‌గా శ్రీకాంత్ గెటప్ బాగుంది.
తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ- టీజర్ విడుదలైనప్పటినుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి మా యూనిట్‌కు ఎంతో బలం వచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం సాయి కొర్రపాటి. ఆయన కొత్తవారిని ఎంకరేజ్ చేసే విధానం గొప్పగా వుంటుంది. కృష్ణ, నేను చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాం. ఈ సినిమాతో తను దర్శకుడిగా నిలబడిపోతాడు. సాంకేతికపరంగా గొప్ప చిత్రమిది. ఓ సామాన్యుడు పవర్‌ఫుల్ విలన్‌పై ఎలా గెలిచాడు అన్నదే ఈ కథ అన్నారు.