15న వస్తున్నాడు.. ఉంగరాల రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జ్ జంటగా రానున్న చిత్రం ఉంగరాల రాంబాబు. పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్‌లో రూపొందించామని నిర్మాత పరుచూరి చెబుతున్నారు. క్రాంతిమాధవ్ తరహా మేకింగ్ వైవిధ్యంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే చిత్రంగా ఉంటుదని అన్నారు. తమ అంచనాలకు మించి సర్వేష్ మురారి కెమెరా పనితనం చూపించారని నిర్మాత తెలిపారు. నిర్మాత దిల్‌రాజు వాయిస్ ఓవర్ ఈ సినిమాకు హైలెట్ కానుంది. సినిమా మొదటి భాగమంతా కామెడీతో సాగుతూ రెండో భాగంలో రెండింతల కామెడీతో ప్రతి డైలాగ్ ఆలోచించేలా డిజైన్ చేసినట్టు నిర్మాత వెల్లడించారు.
చాలా సంవత్సరాల తరువాత సునీల్ పాత్ర నవ్వింపజేస్తూ, పాటలను ఆకట్టుకునేలా డాన్సులు ఉంటాయని అన్నారు. పోసాని కృష్ణమురళి, ప్రకాష్‌రాజ్, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, విజయకుమార్, నల్ల వేణు, హేమంత్, రమణారెడ్డి, జెమిని ప్రసాద్, మిధున తదితరులు నటించిన చిత్రానికి సంగీతం జీబ్రాన్ అందిస్తున్నారు.