తేజ్‌తో తేజ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాల తరువాత నేనే రాజు నేనే మంత్రితో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఫిదా సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న వరుణ్‌తేజ్‌తో ఈ సినిమా వుంటుందని వార్తలొస్తున్నాయి. వరుణ్‌తేజ్ ప్రస్తుతం వెంకి అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత తేజాతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న తేజ, త్వరలోనే వరుణ్‌తేజ్‌తో చర్చలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగా కాంపౌండ్‌లో మంచి హిట్ పడిందంటే తరువాత వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.