అంత బోల్డా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వెయిటింగ్ సినిమాల లిస్టులో జూలీ2 సినిమా కూడా ఉంది. అప్పట్లో నేహాధూపియా నటించి సంచలనం రేపిన ఆ సినిమాకు రీ మేక్ ఇది. సౌత్ బాల లక్ష్మీరాయ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లో లక్ష్మీరాయ్ అందాలు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోయేలా ప్లాన్ చేసుకుంది లక్ష్మీరాయ్. లక్ష్మీరాయ్‌కి ఈమధ్య సౌత్‌లో అవకాశాలు కరువయ్యాయి. ఈమధ్యే ఐటమ్‌గర్ల్‌గా చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో నర్తించినా కూడా పెద్దగా లాభం లేకపోయింది. తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు కరువవడంతో బాలీవుడ్‌లోకి వచ్చిన జూలీ2ను నమ్ముకుంది. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఓ రేంజిలో అందాల ప్రదర్శన చేసిందని ముఖ్యంగా ఓ సన్నివేశంలో న్యూడ్‌గా కూడా కనిపిస్తుందని సమాచారం. ఇప్పటికే గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న లక్ష్మీరాయ్ జూలీ2తో సంచలనం రేపడం ఖాయమని బాలీవుడ్ భావిస్తోంది.