మెగా పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచె సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్‌కు ఆ తరువాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు ఆసక్తి చూపిస్తున్న ఈమె నక్షత్రం సినిమాలో ఓ రేంజ్‌లో గ్లామర్ ప్రదర్శన చేసి షాకిచ్చింది. తాజాగా ప్రగ్యాకు మెగాఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ హీరోయిన్‌గా ఈమెను తీసుకున్నారట. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ వుంటారని, అందులో ఇప్పటికే నయనతార కన్‌ఫర్మ్ అయింది. రెండో హీరోయిన్‌గా అనుష్క నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మూడో హీరోయిన్‌గా పగ్యాను తీసుకున్నారట. ఇందులో ఈమె పాత్ర నరసింహారెడ్డి అనుచరురాలిగా కనిపిస్తుందని సమాచారం.

చిత్రం..ప్రగ్యా జైశ్వాల్