50 రోజుల ఫిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఫిదా చిత్రం ఘనవిజయం సాధించి అర్ధ శతదినోత్సవాన్ని పూర్తిర చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం యాభై రోజుల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులకు షీల్డులు ప్రదానం చేసారు. అనంతరం నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ దర్శకుడు శేఖర్, హీరో వరుణ్‌తేజ్ ఇద్దరూ విదేశాలకు వెడుతున్న సందర్భంగా నాలుగు రోజుల ముందే యాభై రోజుల వేడుకను జరుపుతున్నాం. ఇరవై సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్‌గా, పధ్నాలుగు సంవత్సరాల నిర్మాతగా ఉన్న తరుణంలో ఏడవ వారంలో కూడా థియేటర్‌లు హౌస్‌ఫుల్ కావడం బాహుబలి తర్వాత చిన్న సినిమాగా విడుదలైన ఫిదాకే దక్కింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుందని చాలామంది అంటుంటారు. అలాగే ఈ సినిమా గురించి మేము అనుకున్నాం. అందుకే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. హాపీడేస్ తర్వాత ఆ రేంజ్‌లో విజయాన్ని అందుకున్న చిత్రం ఫిదా అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా యాభై, వంద రోజుల వేడుకలు జరగడంలేదు. వస్తున్న సినిమాలన్నీ మూడు నాలుగు వారాల తర్వాత తీసేస్తున్నారు. ఈలోగా వసూళ్లు వచ్చేస్తున్నాయి. కానీ ఫిదా సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్‌రావడం ఆనందంగా ఉంది, ఇంత మంచి సినిమాను చేసిన శేఖర క మ్ములకు, దిల్‌రాజుకు ధన్యవాదాలన్నారు సాయిపల్లవి మాట్లాడుతూ ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు, ఇప్పుడు నన్ను ఎక్కడ చూసినా భానుమతి అని పిలుస్తున్నారు అన్నారు.