శర్వా.. మహానుభావుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పాత్రల్లో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం మహానుభావుడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూరె్తైంది. యు.వి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ కథానాయికగా వంశి, ప్రమోద్ నిర్మించిన చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయనున్నారు. ఆడియో సింగిల్స్, దియేటర్ ట్రైలర్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేశారు. ఇటలీ, ఆస్ట్రియా, క్రొయేషియా లాంటి దేశాలలో, పొల్లాచ్చి, హైదరాబాద్‌లలోని పలు అందమైన లొకేషన్‌లలో షూటింగ్ జరిపారు. నిర్మాతలు మాట్లాడుతూ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రంలో మహానుభావుడి పాత్ర నుండి వచ్చిన కామెడీ నచ్చి తెరకెక్కించామన్నారు. శర్వానంద్‌కు తమ సంస్థలో మరో మంచి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందన్నారు. శర్వానంద్ డిఫరెంట్ పాత్రలో కన్పించే ఈ చిత్రాన్ని మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడకుండా రూపొందించామని చెప్పారు. తమ సంస్థలో ఆయన చేస్తున్న మూడో చిత్రం ఇదని, టీజర్ చూస్తే కామెడీ ఏ రేంజ్‌లో వుందో అర్థమవుతోందన్నారు. భలే భలే మగాడివోయ్ చిత్రం తరువాత తనకు నచ్చిన పాత్రతో మహానుభావుడు చిత్రాన్ని రూపొందించానని, శర్వానంద్ ఫుల్ కామెడీ నేపథ్యంలో నటించాడని, మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించామని దర్శకుడు మారుతి తెలిపారు. ఈరోజున విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందని, మళ్లీ తన స్టైల్లో వుందని అందరూ చెప్పడం ఆనందాన్నిస్తోందని, శర్వానంద్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన అన్నారు. తమన్ అందించిన ఆడియో అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు.