ఇంద్రసేన ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోని తాజాగా నటిస్తున్న చిత్రం ఇంద్రసేన. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- రాధిక నిర్మాణంలో వస్తున్న ఇంద్రసేనా టైటిల్ చూడగానే నాకు ఇంద్ర సినిమా గుర్తుకొచ్చింది. అందులోని డైలాగ్ కూడా గుర్తొచ్చింది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్, ఎప్పుడూ కొత్తతరహా సినిమాలతో అలరిస్తుంటాడు. అతనొక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ- మెగాస్టార్‌తో ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం ఆనందంగా వుంది. రాధికతో కలిసి సినిమా నిర్మించడం తప్పకుండా నాకు కలిసివచ్చే విషయం. తప్పకుండా మా ఇంద్రసేన అందరికీ నచ్చుతాడు అన్నారు. రాధిక మాట్లాడుతూ- ఫస్ట్‌లుక్‌ను చిరంజీవితోనే విడుదల చేయించాలని విజయ్ పట్టుపట్టాడు. ఇంద్ర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను చేసిన చిరంజీవిగారు అయితే బాగుంటుందని అనిపించి ఆయనతో చేయించాం. మాకు సహకరించిన ఆయన కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు:బాషాశ్రీ, సంగీతం, ఎడిటింగ్:విజయ్ ఆంటోని, కెమెరా:కె.దిల్‌రాజ్, నిర్మాతలు:రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, దర్శకత్వం:జి.శ్రీనివాసన్.

చిత్రం..చిరంజీవి, రాధిక, విజయ్‌ఆంటోని, దర్శకుడు శ్రీనివాసన్ తదితరులు