ఫ్లాప్ సినిమాలు ఎవరూ చేయరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులకు కామెడీ సినిమాలంటే తెగ ఆసక్తి. అందుకే ప్రతి సినిమాలో కామెడీ కోసం ఎదురుచూస్తుంటాం. అందుకే మన దగ్గర కామెడీ కోసం ప్రత్యేకంగా హీరోలు ఉన్నారు. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అల్లరితో కెరీర్ మొదలుపెట్టిన నరేష్, 53 సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేడమీద అబ్బాయి’. ప్రజీద్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..
మేడమీది అబ్బాయి..
ఇందులో బిటెక్ చదువుతున్న యువకుడిగా కన్పిస్తాను. సినిమా చేయాలనే కోరికతోవున్న యువకుడు. ఏదో సాధించాలని కలలుకంటూ వుంటాడు. కానీ ఏదీ సీరియస్‌గా తీసుకోడు. అలాంటి వ్యక్తి జీవితంలో అనుకోని సంఘటనలు జరిగితే ఏమవుతుందన్నది ఈ సినిమా.
భిన్నంగా చేయాలనే
రెగ్యులర్‌గా కామెడీ సినిమాలు చేయడంతో నాకే బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే చేసిన ప్రయత్నమే ఈ థ్రిల్లర్. దాంతోపాటు మంచి కామెడీ వుంటుంది. నాకు గమ్యం, నేను, శంభో శివశంభో లాంటి చిత్రాలు చేయాలని వుంది.
టైటిల్ గురించి
నిజానికి ఈ టైటిల్ 2012లో కృష్ణ్భగవాన్ చెప్పిన ఐడియాతో రిజిష్టర్ చేయించాం. కానీ ఆ ప్రాజెక్టు కుదరకపోవడంతో ఈ సినిమాకు కుదురుతుందని ఆ టైటిల్‌ను ఎంచుకున్నాం. ఇందులో నా పాత్ర ఎక్కువగా మేడమీద వుండి వచ్చిపోయేవాళ్లను చూస్తూ కామెంట్ చేస్తాను. పక్కింట్లో వున్న అమ్మాయితో కూడా మేడమీదనుండే ప్రేమలో పడేస్తాను. కథకు సరైన టైటిల్.
దర్శకుడి గురించి?
ఇది మలయాళంలో సూపర్‌హిట్ అయిన సినిమాకు రీమేక్. మలయాళ దర్శకుడు ప్రజీత్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయనతో చేస్తేనే న్యాయం చేయగలమనిపించింది. మన నేటివిటీ కోసం చిన్న చిన్న మార్పులు చేశాం. కథను చాలా అద్భుతంగా నడిపించాడు.
గత సినిమాల ఎఫెక్ట్
నేను చేస్తున్న సినిమాల్లో స్ఫూప్‌లు ఎక్కువగా వుంటున్నాయని అంటున్నారు. అందుకని సుడిగాడు తరువాత అలాంటివి చేయవద్దని నిర్ణయించుకున్నాను. కానీ కొత్తగా చేస్తూనే మంచి కామెడీ పండించగలిగితే తప్పకుండా విజయం దక్కుతుంది. గత సినిమాల ఎఫెక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే, ఎవరూ ఫ్లాప్ అవ్వాలని సినిమాలు చేయరు కదా.
మిగతా నటీనటుల గురించి
ఈ సినిమాలో ఆది, అవసరాల శ్రీనివాస్ నటించారు. ఎప్పుడూ నా సినిమాల్లో నేనే పంచ్‌లు వేయడం ఎందుకని వేరే పాత్రతో ఆ పంచ్‌లు వేయించాం. అవసరాల శ్రీనివాస్ పాత్ర అద్భుతంగా వుంటుంది. అలాగే హీరోయిన్ నిఖిలా విమల్ కూడా బాగా చేసింది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం రెండు సినిమాలు స్క్రిప్ట్‌వర్క్ దశలో వున్నాయి. దసరా తరువాత ఓ సినిమా మొదలవుతుంది. ఆ తరువాత మరో సినిమా వుంటుంది.

- యు