ప్రేమ మధురం ప్రియురాలు కఠినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవిడోరా ప్రధాన తారాగణంగా థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరు దర్శకత్వంలో గోవర్థన్ రూపొందించిన చిత్రం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (పెంపక్). ఈచిత్రానికి సంబంధించిన ఆడియోను జితిన్ రోషన్ అందించారు. ఒక్కొక్కరు ఒక్కో పాటను విడుదల చేయగా సి.కల్యాణ్, జెమిని కిరణ్ ఆడి యో సీడీని విడుదల చేశారు. చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా థియేటర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గోవర్థన్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని సంవత్సరం క్రితం ఎంతోమంది ప్రోత్సాహంతో షూటింగ్ ప్రారంభించానని, అమెరికాలో అందుబాటులో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో అధికభాగం నిర్మించానని, తప్పక అందరికీ నచ్చుతుందని తెలిపారు. గోవర్థన్‌లో వున్న పాషన్, ప్రతిభ నచ్చి ఈ సినిమాకు తాము సహకరిస్తున్నామని, ఓ మంచి దర్శకుడుగా అతను నిరూపించుకుంటాడని, ఈనెల 15న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని బెక్కం వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, వల్లూరుపల్లి రమేశ్, రాజ్‌కందుకూరి, డి.ఎస్.రావు, విజయ్‌కుమార్ కొండా, ఉత్తేజ్, లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.