ఇట్లు.. మీ సరోజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. అయాన్, కాంచన ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో స్ర్తిలపై జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, దాడులకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కొంతమంది స్ర్తిల జీవితాలలో యధర్థంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను రాసుకున్నామని తెలిపారు. ఓ స్ర్తిని స్ర్తిగా బతకనివ్వకుండా సమాజం ఆమెను వెలయాలుగా మార్చడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని తీసుకొని అన్ని వర్గాలకు నచ్చే సన్నివేశాలతో ఎలిమెంట్స్‌తో రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తిచేసి మిగతా షూటింగ్ త్వరలోనే చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామని, నేటి యువత, కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని చూస్తారని, నటీనటుల అభినయం, పాటలు ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటాయని ఆయన అన్నారు. యధార్థ కథలను వున్నది వున్నట్లు తీస్తే ప్రేక్షకులకు రుచించదని, కొన్ని వాణిజ్య అంశాలను కూడా ఈ చిత్రంలో చేర్చి సరికొత్తగా రూపొందించామని ఆయన అన్నారు.