స్పైడర్ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 3స్పైడర్2విడుదలకు దగ్గర పడుతున్నకొద్దీ సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా 3బాహుబలి2 తరువాత ఆ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుండడం విశేషం. ఇప్పటికే పలు ఏరియా హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. తాజాగా తమిళ హక్కులు కూడా 23 కోట్లకు ప్రముఖ నిర్మాతలు సొంతం చేసుకున్నారు. దాంతోపాటు తాజాగా 3స్పైడర్2 తమిళ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందట. ఇప్పటికే విడుదలైన ఆడియో సంచలనం సృష్టిస్తుండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈనెల 15న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. అత్యం త భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.