ప్రభాస్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫార్ట్యూన్ మూవీస్ పతాకంపై నూతన నటీనటులను తెలు తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు సాగర్ చాలా కాలం తరువాత దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘ప్రభాస్’ శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎఫ్‌బిసి చైర్మన్ రామ్‌మోహన్ క్లాప్‌నివ్వగా, కెమెరా కె.ఎస్.రామారావు స్విచ్ ఆన్ చేయగా, ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించి ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం ఈ చిత్ర దర్శకుడు సాగర్ మాట్లాడుతూ- నేను ఇంతవరకు 30 సినిమాలు చేశాను. చాలా గ్యాప్ తీసుకున్న తరువాత ఒక డిఫరెంట్ జోనర్ చిత్రాన్ని తెరకెక్కంచబోతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందీ చిత్రం. నా దర్శకత్వంలో సినిమా రావడానికి ఎక్కువ సమయం పట్టింది కనుక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నా. హడావుడిగా సినిమా చేసేసి విడుదల చేసే ఆలోచన నాకు లేదు. ఫుల్ ప్లెడ్జ్‌గా సినిమా చేశాను అనే సంతృప్తితోనే సినిమా విడుదల చేస్తాను. ఈ చిత్రానికి హీరో నితీష్ రెడ్డి చైల్డ్ ఆర్టిస్టుగా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నూతన హీరోయిన్స్‌ను పరిచయం చేయడానికి కారణం, వీరైతే చిత్రీకరణ మరియు పబ్లిసిటీ సమయంలో అనుకూలంగా వుంటూ సపోర్టు చేయగలుగుతారు. ఎక్స్‌పీరియెన్స్ తారలైతే డేట్స్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, షూటింగ్ దీపావళి నుంచి ప్రారంభించనున్నాం అని తెలిపారు. హీరో నితీష్‌రెడ్డి మాట్లాడుతూ- మగమహారాజు, రేపటి పౌరులు సినిమాలో పి.ఎల్.నారాయణగారి కొడుకుగా నేను బడికి వెళ్తా అనే పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాను. ప్రస్తుతం కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో హీరోగా నటించిన సినిమాలు విజయవంతం అయ్యాయి. మంచి కథకలిగిన సినిమాతో పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. నిర్మాత అశోక్ మాట్లాడుతూ- దర్శకుడు సాగర్ చెప్పిన స్టోరీతో సినమా చేయడానికి అంగీకరించాను అన్నారు. నితీష్‌కుమార్‌రెడ్డి, అమృత, నదిని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్:ప్రభాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సాగర్.