హీరోయిన్‌గా అంజలి సోదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు హీరోయిన్ అంజలి చెల్లెలు ఆరాధ్య పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో వున్న ఈమె, వెండితెరపై హీరోయిన్‌గా సత్తా చాటుకోవాలని ఉందని చెబుతోంది ఆరాధ్య. శనివారం ఆమె హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ- చిన్నప్పటినుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నన్ను సినిమాల్లోకి వెళ్లచ్చు గదా అని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే అక్క అంజలి హీరోయిన్‌గా రాణించింది. తనని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అడుగుపెట్టాను. అక్కలాగే నేను కూడా తెలుగు పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటా. అదృష్టం అనేదానికంటే అక్క పడిన కష్టమే తన ఉన్నతికి కారణం. మా అమ్మ కూడా తనకు మంచి సపోర్టు అందించింది. ఆమె సహకారంతోనే వస్తున్నాను. చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్నాను. నాకు నటిగా పేరొచ్చే ఏ పాత్రైనా చేస్తా. గ్లామరా, నటనా అనేదానికంటే మంచి కథలు ముఖ్యం. ప్రస్తుతం తమిళ, తెలుగులో నటిస్తున్నా అన్నారు.