3డిలో రోబో 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ ర జనీకాంత్ సంచలన దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో 2.0’. గతంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోం ది. జనవరి 25న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుండగా, అమీ జాక్సన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని 3డి ఫార్మట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ ఐమాక్స్ స్క్రీన్‌లవరకు పరిమితమైన 3డి ఇప్పుడు సాధారణ థియేటర్‌లలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ పరిజ్ఞానం రోబో 2.0 సినిమాతో వస్తోంది. ఇకపై రోబో 2.0 చిత్రాన్ని మీకు నచ్చిన థియేటర్‌లలో 3డిలో చూడొచ్చని అంటున్నారు నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ఐమాక్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ- ఇండియన్ అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా రోబో 2.0 తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 2డిలోనే కాకుండా 3డిలో కూడా రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. చైనాలో 15వేలకు పైగా థియేటర్‌లలో విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు, శరత్ మరార్, భరత్, ప్రీతమ్, సత్యం, సందీప్ వంగ తదితరులు పాల్గొన్నారు.