త్వరలో నాన్న.. నేను.. వర్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓం డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శ్‌బాబు, పావని జంటగా అజ్మీరా చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘నాన్న.. నేను..వర్ష’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ ఈనెల 10కి సిద్ధం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చందు మాట్లాడుతూ, హీరో కొత్తవాడైనా డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయాలలో మంచి ప్రతిభను కనబరిచారని, 12 గెటప్‌లతో హీరో కనిపించే ఈ చిత్రంలో అన్ని హంగులు ఉన్నాయని తెలిపారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెలలో, మార్చి మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. బస్టాప్ కోటేశ్వరరావు, చలాకి చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, మంగూలాల్, సమీర, అక్షయ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:విశ్వత్ చంద్, దాస్, ఆదిత్య, లక్ష్మణ్, సంగీతం:డేవిడ్, కెమెరా:డి.విజయకుమార్, ఎడిటింగ్:అనిల్‌రాజ్, నిర్మాత:ఎ.ఎస్.రావు, రచన, దర్శకత్వం:అజ్మీరా చందు.