నిర్మాతగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ లైఫ్‌టైమ్ చాలా తక్కువ. మహా అయితే పదేళ్లపాటు హీరోయిన్‌గా వెలగొచ్చు. ఆ తర్వాత పెళ్లి, కాపురం, పిల్లలు అంటూ వాళ్ల కెరీర్ మరోదారిలో పయనిస్తుంది. కొందరైతే మళ్లీ రీఎంట్రీతో అక్క, అత్త, వదినలాంటి పాత్రలతో అలరించడానికి వస్తుంటారు. ఈమధ్య కొందరు హీరోయిన్లు మాత్రం స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతూనే అటు బిజినెస్ రంగంలో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలు అనుష్కాశర్మ, ప్రియాంకా చోప్రాలు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులోకి వచ్చింది మిల్కీ భామ తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తమన్నాకు ప్రస్తుతం అభినేత్రి తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇటీవలే సందీప్‌కిషన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా జైలవకుశలో ఐటెం సాంగ్‌లో ఆడి పాడిన తమ న్నా, నిర్మాతగా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు తమన్నా నిర్మాతగా వ్యవహరిస్తుందట. దాంతోపాటు ఇందు లో ఆమె కాస్త నెగెటివ్ టచ్‌తో వున్న పాత్ర లో కన్పిస్తుందట. ఇప్పటికే నగల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న తమన్నా నిర్మాతగా ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి!