కేరాఫ్ సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశీంద్రన్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి రూపొందిస్తున్న చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- నేషనల్ అవార్డు తీసుకున్న సుశీంద్రన్‌తో పనిచేయడం సంతోషదాయకమని, సందీప్‌కిషన్ కెరీర్‌లో ది బెస్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా ఎమోషన్ లవ్‌తో ఓ అందమైన పాయింట్‌తో ఈ చిత్రంలో కథ వుంటుందని తెలిపారు. ఇమ్మాన్ నేతృత్వంలో సంగీతం హైలెట్‌గా వుంటుందని, త్వరలో మరిన్ని విశేషాలు తెలియజేస్తామని ఆయన అన్నారు. షూటింగ్ దశలోనే ఈ సినిమా పూర్తి సంతృప్తి ఇచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని కథానాయకుడు సందీప్‌కిషన్ అన్నారు. దర్శకుడు అద్భుతమైన ప్రతిభతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని, ప్రతి కుటుంబంలో వ్యక్తులకు ఈ సినిమాలో పాత్రలు కనెక్ట్ అవుతాయని, ప్రతి సన్నివేశం ఎమోషన్‌గా సాగుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం:సుశీంద్రన్.