భారీ స్థాయిలోనే సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ను కలిగిస్తుందని, ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ చిత్రం మరోవైపు ట్రేడ్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. ముఖ్యం గా బాహుబలి అంతర్జాతీయంగా స్టార్‌గా మారిన ప్రభాస్ కోసం బయ్యర్లు అధిక మొత్తం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.