అమితాబ్‌కు 23 మిలియన్ లైక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై-సోషల్ మీడియాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హవా మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయనకు ఫేస్‌బుక్‌లో 23 మిలియన్లమంది లైక్స్ వచ్చాయి. ఆయనను అనుసరిస్తున్నవారి సంఖ్య ఫిబ్రవరి 5వ తేదీనాటికి 23,032,439కు చేరుకుందని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2+3 అంటే 5 అని, ఫిబ్రవరి 5 తన కుమారుడు అభిషేక్ పుట్టినరోజుకావడం, తాను 23 మిలియన్ల మంది అభిమానాన్ని పొందడం సంతోషకరమైన విషయమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ నటుల్లో సల్మాన్‌ఖాన్ అందరికన్నా 29 మిలియన్లమంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు రెండోస్థానానికి చేరుకున్నారు. 18మిలియన్లమంది ఫాలోవర్లతో ప్రియాంకచోప్రా మూడోస్థానంలో ఉండగా షారుక్‌ఖాన్ 17 మిలియన్లమంది ఫాలోవర్లతో నాలుగోస్థానంలో ఉన్నారు. కాగా అదేస్థాయిలో అక్షయ్‌కుమార్‌కూడా ఫాలోవర్లతో ఉండగా ఆరోస్థానంలో అమీర్‌ఖాన్ (15మిలియన్లమంది) ఉన్నారు.