ఇక క్వీన్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి రీమేక్‌గా తెలుగులో తమన్నా ముఖ్యపాత్రలో ‘క్వీన్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మనుకుమారన్. నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మనుకుమార్ మాట్లాడుతూ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందే ఈ సినిమాను మా బ్యానర్ నాలుగు భాషల్లో నిర్మిస్తోంది. తెలుగులో ‘క్వీన్’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రానికి తమిళంలో పారిస్ పారిస్, మళయాలంలో ‘జంజం’, కన్నడంలో ‘బటర్ ఫ్లై’ పేరుతో తెరకెక్కిస్తున్నాం. నీలకంఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేరోజు విడుదల చేస్తాం అన్నారు. దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ‘క్వీన్’ హిందీ చిత్రం చూస్తున్నప్పుడు ఓ రియల్ సంఘటన చూసిన అనుభూతి కలిగింది. హిందీలో వంద కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా భిన్నమైన ప్రేమకథా చిత్రం. ప్రతి మనిషి జీవితంలో బ్రోకెన్ లవ్‌స్టోరీ బాగా గుర్తుంటుంది. జీవితంలో ప్రేమలు విఫలమైన ఓ యువతి అన్నీ పక్కనపెట్టి ఎలాంటి విజయాలు సాధించిందీ అనేది కథ. తమన్నా వంద శాతం సూటవుతుందని ఆమెను ఎంపిక చేసాం. నిర్మాత ఇప్పటికే పాతిక సినిమాలను నిర్మించారు. ఎంతో పాషన్‌తో ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో నిర్మిస్తున్నారన్నారు. తమన్నా మాట్లాడుతూ హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఒక అమ్మాయిని హ్యూమన్ బీయింగ్‌లా చూడాలనిపించింది. 2014లో విడుదలైన ఈ సినిమా ఇక్కడ రీమేక్ చేస్తే బాగుంటుందనిపించింది. లక్కీగా ఇప్పుడా అవకాశం నాకు రావడం ఆనందంగా వుంది. తమిళంలో రమేశ్ అరవింద్, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. తప్పకుండా నా కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిలిం అవుతుందన్న నమ్మకం వుందన్నారు.

చిత్రం..తమన్నా