చైతూ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా ‘యుద్ధం శరణం’ సినిమాలో నటించిన నాగచైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల మూడోవారంలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ అయితేనే బాగుంటుందని టీమ్ ఆలోచించిందట. నిధి బాలీవుడ్‌లో మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటిసారి సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న ఈమె తప్పకుండా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా ప్రముఖ నటుడు మాధవన్ నటిస్తాడని సమాచారం. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధిచిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.